: మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు మరో పురస్కారం
మ్యూజిక్ మేస్ట్రో, పద్మభూషణ్ ఇళయరాజా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. కేరళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పురస్కారం 'నిషగంధి' పురస్కారానికి ఇళయరాజాను ఎంపిక చేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో ఆయన చేసిన విశేషమైన సేవలకు గాను ఆయనను 'నిషగంధి' పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేరళ పర్యాటక శాఖ మంత్రి ఎ.పి. అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన కేరళలో నిర్వహించనున్న ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఈ పురస్కారాన్ని ఇళయరాజాకు అందజేయనున్నారని ఆయన చెప్పారు.