: మందుబాబులూ... హ్యాంగోవర్ తగ్గలేదా? ఇలా చేయండి!
గత రాత్రి జరుపుకున్న న్యూ ఇయర్ పార్టీ కానివ్వండి. లేదా మరేదైనా పార్టీలో స్నేహితులతో గడిపి ఏ అర్ధరాత్రో, తెల్లవారుఝామునో ఇంటికి చేరుకుని పొద్దున్నే భరించలేని తలనొప్పితో హ్యాంగోవర్ తో బాధపడటం చాలా మందికి అనుభవమే. ఆ సమయంలో ఏం చేస్తే సులభంగా హ్యాంగోవర్ నుంచి బయటపడొచ్చంటే... యాపిల్స్ అండ్ బనానా: హ్యంగోవర్ తో బాధపడుతున్న వేళ యాపిల్, అరటిపండు తినడం త్వరిత ఉపశమనాన్ని ఇస్తుంది. యాపిల్ లేదా బనానా షేక్ ను ఖాళీ కడుపుతో తీసుకుంటే, కడుపు త్వరగా రిలాక్స్ అవుతుంది. వీటి వల్ల కోల్పోయిన బ్లడ్-షుగర్ స్థాయి కూడా పెరుగుతుంది. పొటాషియం వంటి లవణాలు శరీరంలోకి తిరిగి చేరుతాయి. తేనె: శరీరానికి మోతాదు మించే మద్యం నుంచి తేనె సత్వర ఉపశమనాన్ని కలిగిస్తుంది. శరీరంలోని మెటబాలిజం తిరిగి సాధారణ స్థితికి చేరుతుంది. వేగంగా ఆల్కహాల్ జీర్ణం కావడానికి తోడ్పడుతుంది. అల్లం: హ్యంగోవర్ నుంచి బయటపడటానికి అల్లం నమ్మదగిన ఉత్పత్తి. రెండు చిన్న అల్లం ముక్కలను నోటిలో వేసుకుని నమలడం, లేదా అల్లం టీ తాగడం వేగంగా రిలీఫ్ ను ఇస్తుంది. అల్లంముక్కలను నీటిలో మరిగించి, ఆపై ఆరంజ్ లేదా లెమన్ లేదా తేనెలో కలుపుకు తాగినా మంచిదే. నిమ్మ: నిమ్మరసం తాగడం మద్యం చూపే ప్రభావం నుంచి ఇన్ స్టంట్ రిలీఫ్ ను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక అదే నిమ్మరసాన్ని కూలింగ్ వాటర్ తో కలిపి తీసుకుంటే వెంటనే హ్యాంగోవర్ తగ్గిపోతుంది. టమోటా: ఫ్రుక్ట్రోజ్ అధికంగా ఉండే టమోటా సూప్ కూడా హ్యాంగోవర్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. వీటితో పాటు మజ్జిగ తీసుకున్నా రిలీఫ్ లభిస్తుంది. కొన్ని గుర్తుంచుకోవాల్సిన అంశాలు... * ఖాళీ కడుపున ఎప్పుడూ మద్యం సేవించకండి. అసలు మద్యం తాగడమే చెడ్డ అలవాటు. ఇక తాగాల్సి వస్తే, ఏదైనా స్టఫ్ తీసుకుంటూ తాగాలి. దీనివల్ల రక్తంలోకి ప్రవేశించే ఆల్కహాల్ ప్రభావం తగ్గుతుంది. * పెగ్గుకు, పెగ్గుకూ మధ్య ఆపై ఓ కూల్ డ్రింక్ తాగండి. దీనివల్ల ఆల్కహాల్ క్వాంటిటీ తగ్గుతుంది. * మద్యం ఏదైనా చెడు ప్రభావం కలిగించేదే. అయితే, వైట్ వైన్, వోడ్కా, జిన్ వంటివి మిగతా ఉత్పత్తులతో పోలిస్తే తక్కువ చెడు ప్రభావాన్ని చూపుతాయి. * ఏదైనా కార్బొనేటెడ్ డ్రింక్ తో ఆల్కహాల్ కలిపి తీసుకుంటే త్వరగా జీర్ణమైపోతుంది.