: ‘ఫ్లూటో’ ఛాయాచిత్రాలతో అమెరికా పోస్టల్ స్టాంపు!
నాసా తీసిన ఫ్లూటో గ్రహం ఛాయాచిత్రాలతో అమెరికా పోస్టల్ స్టాంపును విడుదల చేయనుంది. ఫ్లూటోకు అతి సమీపంగా నాసా న్యూహారిజాన్ ను ఇటీవల పంపిన విషయం తెలిసిందే. న్యూహారిజాన్ తీసిన ఫ్లూటో ఫొటోలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. ఈ గ్రహాన్ని అతిదగ్గరగా తీసిన ఒక ఫొటోతో ఈ స్టాంపును అమెరికా తయారు చేసింది. అంతేకాకుండా సౌరవ్యవస్థలోని కొన్ని గ్రహాలు, నక్షత్రాలతో కూడా స్టాంపులను విడుదల చేయనుంది. న్యూయార్క్ లో ఈ ఏడాది మే నెల చివరిలో వరల్డ్ స్టాంప్ షోలో ఈ స్టాంపులను ప్రదర్శించనున్నట్లు సమాచారం.