: ఆసుపత్రి నుంచి విద్యాబాలన్ డిశ్చార్జ్... ట్విట్టర్ లో కృతజ్ఞతలు
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ అయింది. ఆ వెంటనే ట్విట్టర్ లో తను ఇంటికి చేరుకున్న విషయాన్ని వెల్లడించింది. "నా పుట్టినరోజు నాడే ఇంటికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా కోసం ప్రార్థన చేసి... ప్రేమ, అభిమానం చూపిన అందరికీ కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరికీ 2016 శుభాకాంక్షలు" అని విద్యా ట్వీట్ చేసింది. కిడ్నీలో సమస్య కారణంగా రెండు రోజుల కిందట అకస్మాత్తుగా విద్యా ఆసుపత్రిలో చేరడంతో వైద్యులు చికిత్స నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త సంవత్సర వేడుకలను కూడా రద్దు చేసుకున్నారు. కాగా ఇవాళ తన పుట్టిన రోజు కావడంతో ఆమె ఉత్సాహంగా కూడా వుంది.