: నాకు చాలా ఆనందంగా ఉంది: సీఎం కేజ్రీవాల్
ఢిల్లీలో సరి-బేసి సంఖ్య వాహన విధానం ఈరోజు విజయవంతంగా అమలు కావడం తనకు చాలా ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజలు ఈ విధానాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించారని కేజ్రీవాల్ అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఢిల్లీ ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఒక మంచి మార్గాన్ని చూపుతారని కేజ్రీవాల్ అన్నారు. ఈరోజు బేసి సంఖ్య రిజిస్ట్రేషన్ ఉన్న కార్లకు మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తారు.