: జీవన విధానాన్ని మార్చుకుంటే కేన్సర్ ను జయించవచ్చు: ఎమ్మెల్యే బాలకృష్ణ
హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆసుపత్రి ఛైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. సర్వేకల్ (గర్భాశయ ముఖద్వార) కేన్సర్ పై అవగాహన, పరీక్షల కోసం ఏర్పాటు చేసిన క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజల జీవన విధానాన్ని మార్చుకుంటే కేన్సర్ ను జయించవచ్చని, అందుకని వాతావరణానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ఏ రంగంలోనైనా సమష్టి కృషితో విజయం సాధ్యమని తెలిపారు. కేన్సర్ పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు.