: తెలుగు వారికి గవర్నర్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు
కొత్త సంవత్సరం సందర్భంగా రాజ్ భవన్ లో ఇవాళ గవర్నర్ నరసింహన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు రెండు దేశంలోనే ముందుండాలని కోరుకున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు రాజ్ భవన్ లో గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.