: కారులో ఎగసిన మంటలు... వాహనంలోని ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు
న్యూ ఇయర్ నాడు భాగ్యనగరి హైదరాబాదులో ఘోరం జరిగేదే. అయితే క్షణాల్లో స్పందించిన స్థానికుల కారణంగా అది ఓ మోస్తరు ప్రమాదంగానే రికార్డయింది. నగరంలోని మీర్ పేట పరిధిలోని గాయత్రి నగర్ లో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో... పార్కింగ్ ప్లేస్ లో నిలిపి ఉన్న మారుతీ కారులోకి ఎక్కిన తొమ్మదేళ్ల శ్రయన్, 16 ఏళ్ల సృజన్ లు ఆడుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి కారులో మంటలు చెలరేగాయి. కారు దిగేలోగానే ఆ చిన్నారులిద్దరినీ చుట్టుముట్టేశాయి. పిల్లల కేకలతో వేగంగా స్పందించిన స్థానికులు వారిద్దరినీ కారులో నుంచి బయటకు లాగేశారు. అయితే అప్పటికే మంటలు వారిద్దరినీ తీవ్ర గాయాలపాల్జేశాయి. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారులో మంటలు చెలరేగడానికి కారణాలు తెలియరాలేదు.