: కింద మూడు శునకాలు, చెట్టు మోడుపై పిల్లి దిగిన సెల్ఫీ... మీరూ చూడండి!
తన ఎదురుగా ఉంచిన స్మార్ట్ ఫోన్ కెమెరా బటన్ ను ప్రెస్ చేయడం ద్వారా ఓ పిల్లి దిగిన సెల్ఫీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నరికేసిన ఓ చెట్టు మోడుపై దర్జాగా నిలబడ్డ పిల్లి, కింద నేలపై మూడు శునకాలు నిలబడి వున్న ఈ 'పిల్లి సెల్ఫీ'కి ఇప్పటివరకూ 10 లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి. ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఎవరు సహకరించారు? ఆ పిల్లి, కుక్కలు ఎవరివి? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియడం లేదు గానీ, ఓ రెండు క్షణాలు చూసి, ఆ చిత్రం అందాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్లు. సదరు పిల్లి సెల్ఫీని మీరూ చూడండి.