: ఘనంగా విశాఖ ఉత్సవాలు ప్రారంభం... ప్రధాన ఆకర్షణగా పుష్ప ప్రదర్శన
విశాఖ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా విశాఖ ఎంజీఎం పార్కులో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విశాఖ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశాఖ సాగర తీరంలోని బీచ్ రోడ్డులో ఉత్తరాంధ్రలోని ప్రధాన ఆలయాల నమూనాలను ప్రదర్శిస్తున్నారు. సాయంత్రం కైలాసగిరిపై లేజర్ షో ప్రదర్శించనున్నారు. ఈ నెల 3న విశాఖ ఉత్సవాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు.