: అమృతసర్ లో 171 మందిని భయపెట్టిన కుక్క!


ఓ శునకం కారణంగా 171 మంది ప్రాణ భయంతో కొద్ది నిమిషాలు అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంజాబ్ లో నిన్న జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే, అమృతసర్ ఎయిర్ పోర్టులో మొత్తం 171 మందితో ఎయిర్ ఇండియా విమానం దుబాయ్ కి బయలుదేరిన వేళ, రన్ వేపైకి ఓ కుక్క దూసుకొచ్చింది. మరో రెండు సెకన్లలో విమానం టేకాఫ్ తీసుకుంటుందనగా, కుక్కను చూసిన పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులను వేయాల్సి వచ్చింది. కుక్క రన్ వే వదిలి వెళుతుందని పైలట్ ఎంతమాత్రం భావించినా, టేకాఫ్ అయిన మరుక్షణం ఆ విమానం కూలిపోయి ఉండే ప్రమాదం అధికమని అధికారులు వ్యాఖ్యానించారు. విమానం ప్రొపెల్లర్లు గాలిని వెనక్కు నెట్టే వేగానికి ఆ శునకం ఇంజన్ లోకి దూసుకెళ్లడం ఖాయమని గుర్తు చేశారు. ఇక తిరిగి బేస్ కు చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం, సాంకేతిక పరీక్షల అనంతరం నాలుగు గంటల ఆలస్యంగా గత రాత్రి గమ్యస్థానానికి బయలుదేరింది.

  • Loading...

More Telugu News