: ఇవాళ ఓయూలో జరగాల్సిన ఎమ్మెస్సీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా


ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో ఇవాళ జరగాల్సిన ఎమ్మెస్సీ మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయని ఓయూ అధికారులు తెలిపారు. జనవరి 1న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడంతో పరీక్షను వాయిదా వేశామని చెప్పారు. తిరిగి ఈ పరీక్ష ఈ నెల 8వ తేదీన జరుగుతుందని తెలిపారు. పరీక్షా సమయంలో గానీ, పరీక్షా కేంద్రంలో గానీ ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. వాయిదా పడిన విషయాన్ని విద్యార్థులు గమనించాలని అధికారులు సూచించారు.

  • Loading...

More Telugu News