: న్యూ ఇయర్ నాడు భాగ్య నగరిలో 555 కేసుల నమోదు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నగర యువత నిన్న రాత్రి ఆడి పాడింది. తాగి ఊగింది. ఆ తర్వాత తూలుతున్న కండీషన్ లోనే రోడ్డెక్కింది. రోడ్ సేఫ్టీ నిబంధనలను తంగలో తొక్కేసి కార్లు, బైకులతో ఇళ్లకు బయలుదేరింది. ముందుగానే పరిస్థితిని అంచనా వేసిన పోలీసులు ఎక్కడికక్కడ డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు. దీంతో నిన్న ఒక్క రాత్రే హైదరాబాదు, సైబరాబాదు పరిధిలో ఏకంగా 555 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పెద్ద సంఖ్యలో కార్లు, బైకులను సీజ్ చేసిన పోలీసులు వాటిని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అప్పటిదాకా న్యూ ఇయర్ జోష్ లో పార్టీని ఎంజాయ్ చేసిన యువత పోలీసులు పట్టేయడంతో తలకెక్కిన మత్తు మొత్తం దిగిపోయి, దిగాలుగా ఇళ్లకు చేరిపోయింది.