: ఇక 'రాజమండ్రి' పేరు కనిపించదు!
"వేదంలా ఘోషించే గోదావరి, అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి... శతాబ్దాల చరితగల సుందర నగరం... గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం" అన్న ఆరుద్ర పలుకులు మరోసారి స్మృతిలోకి తెచ్చుకోవాల్సిన సమయం. రాజరాజనరేంద్రుడి పేరిట ఏర్పడ్డ రాజమహేంద్రవరం పట్టణం, ఆపై కాలక్రమంలో రాజమండ్రిగా మారగా, ఏపీ సర్కారు గత వైభవానికి సూచనగా, రాజమండ్రి పేరును తిరిగి రాజమహేంద్రవరంగా మార్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కారు ఆదేశాలతో తూర్పు గోదావరి జిల్లాలో వ్యాపార కేంద్రంగా ఉన్న రాజమండ్రి, నేటి నుంచి రాజమహేంద్రవరంగా పిలవబడనుంది. ఈ మేరకు అన్ని అధికారిక కార్యాలయాల్లో పేరు మార్పు పాటించాలని, ఆర్టీసీ బస్సులపై పేర్లు మార్చాలని, అన్ని వ్యాపార సంస్థల నేమ్ బోర్డులూ మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది.