: 'మా అందం తాత్కాలికమే' అంటున్న టైటానిక్ భామ!


చూపరుల మతి పోగొట్టే అందంతో కనిపించే సెలబ్రిటీలు ఎవరూ జీవితకాలం పాటు అంతే అందంతో కనిపించరని 'టైటానిక్' హీరోయిన్ కేట్ విన్ స్లెట్ ఓ జీవిత సత్యాన్ని చెప్పింది. రెడ్ కార్పెట్ అందం శాశ్వతం కాదని, ఎప్పుడూ అలానే కనిపిస్తారన్న భ్రమలు వద్దని చెబుతోంది. నేటి తరం అమ్మాయిలు ఈ విషయాన్ని గుర్తెరగాలని, బయట మేకప్ తో కనిపించే తాము, ఇంట్లో అందరిలానే ఉంటామని చెప్పింది. చేస్తున్న వృత్తిలో భాగంగానే తాము మెరుస్తామని, ఈ విషయం అందరితో పంచుకోవాలని అనిపించిందని ట్వీట్లు పెట్టింది. తాను చిన్నతనంలో బొద్దుగా ఉండేదాన్నని, అప్పట్లో అందరూ ఆట పట్టించేవారని పాత జ్ఞాపకాలు నెమరేసుకుంది.

  • Loading...

More Telugu News