: బడుగులకు రుణం కావాలంటే లాటరీ కొట్టాల్సిందే!


రుణాల మంజూరులో అవకతవకలు నివారిస్తామని చెబుతూ బీసీ సంక్షేమ శాఖ ఓ వింత నిర్ణయం తీసుకుంది. రుణాల నిమిత్తం వచ్చే వారిలో లాటరీ తీసి వారికి రుణాలిస్తామని చెబుతోంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వాస్తవానికి బీసీ కార్పొరేషన్ ఇచ్చే రుణాల్లో 60 శాతం వరకూ సబ్సిడీ ఉండటంతో, రుణాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. బడుగులు, బలహీన వర్గాలకు చెందిన ఔత్సాహికులు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించేందుకు రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ రుణాలను బీసీ కార్పొరేషన్ ఇస్తుంది. రుణాలను అవసరమున్న వారికి కాకుండా, దళారుల ప్రమేయంతో తమకు నచ్చిన వారికే ఇస్తున్నారని చానాళ్లుగా ఆరోపణలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లాటరీ ఎంపిక తెరపైకి వచ్చింది. విద్యావంతులు, నిరుద్యోగులు, పేదల నుంచి వచ్చిన దరఖాస్తులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసి, ఆపై లాటరీ తీయాలన్నది అధికారుల అభిమతంగా తెలుస్తోంది. కాగా, రుణాల మంజూరులో లాటరీ పద్దతేంటన్న విమర్శలూ వస్తున్నాయి.

  • Loading...

More Telugu News