: భారత జట్టులోకి వచ్చినా... యువరాజ్ ను వదిలించుకున్న ఢిల్లీ, రూ. 16 కోట్లు లాభం


తిరిగి ఫాంలోకి వచ్చి భారత టీ-20 జట్టులో స్థానం సంపాదించుకున్నప్పటికీ, ఢిల్లీ ఐపీఎల్ జట్టుకు మాత్రం యువరాజ్ దూరమయ్యాడు. ఐపీఎల్ 9వ సీజన్ లో యువరాజ్ తో పాటు లంక ఆటగాడు మాథ్యూస్ ను వదిలించుకుంటున్నట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు ప్రకటించింది. గత వేలంలో రూ. 16 కోట్లు పలికిన యువీ ఢిల్లీని నిరాశకు గురి చేస్తూ, కేవలం 248 పరుగులు మాత్రమే చేయగలిగాడు. యువరాజ్ ను వదులుకోవడం వల్ల తమ కిట్టీలో రూ. 16 కోట్లు మిగిలాయని, ఆ డబ్బుతో వేరే ఆటగాళ్లను కొనే ప్రయత్నం చేస్తామని ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రతినిధి హేమంత్ వివరించాడు. మొత్తం మీద ఇద్దరు ఆటగాళ్లను తొలగించి రూ. 23 కోట్లు ఆదా చేశామని తెలిపాడు. కాగా, ఈ సంవత్సరం వివిధ ఫ్రాంచైజీల నుంచి మొత్తం 61 మంది విడుదల కాగా, బెంగళూరు జట్టు అత్యధికంగా 14 మందిని తొలగించింది. వచ్చే నెల 6న బెంగళూరులో ఆటగాళ్ల వేలం సాగుతుందన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News