: దుబాయి హోటల్లో మంటలు... యాక్సిడెంట్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒమర్ అబ్దుల్లా


ఆకాశహర్మ్యాలకు ప్రసిద్ధిగాంచిన దుబాయిలో నిన్న పెను ప్రమాదం సంభవించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతిగా రికార్డులకెక్కిన బుర్జ్ ఖలీఫాకు అతి సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం దుబాయ్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. న్యూ ఇయర్ వేడుకలు మరికాసేపట్లో ప్రారంభమవుతాయనగా బుర్జ్ ఖలీపాకు కూతవేటు దూరంలోని ‘ద అడ్రెస్ ఇన్ దుబాయ్’ హోటల్ లో మంటలు చెలరేగాయి. 63 అంతస్తులతో ఉన్న ఈ భవంతిలో కిందిభాగంలో ఎగసిన మంటలు క్షణాల్లో భవనం పై భాగానికి విస్తరించాయి. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వారితో పాటు హోటల్ లోని వ్యక్తులు ప్రమాదం సంభవించిన వెంటనే పరుగు పరుగున బయటకు వచ్చేశారు. ఈ ప్రమాదంలో 16 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అక్కడికి సమీపంలోనే ఉన్నారు. ప్రమాదం సంభవించిన హోటల్ కు సమీపంలోని మరో హోటల్ లో బస చేసిన అబ్దుల్లా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను తన సెల్ ఫోన్ తో రికార్డు చేసి, ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన తీరుపైనా ఆయన కామెంట్లు పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News