: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త...కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సరం నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. 9,281 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టులు 4,065, 56 సీపీఎల్ కానిస్టేబుల్ పోస్టులు, సివిల్ కానిస్టేబుల్ పోస్టులు 1,880, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు 276, ఎస్పీఎఫ్ పోస్టులు 174, ఫైర్ మెన్ పోస్టులు 416 భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్ శారీరక దారుడ్యపరీక్షల్లో భాగంగా నిర్వహించే 5 కిలోమీటర్ల పరుగు పందానికి స్వస్తి చెప్పింది. దాని స్థానంలో 2.5 కిలోమీటర్ల పరుగు పందెం ప్రవేశపెట్టింది. పురుషులకు 800 మీటర్ల పరుగు పందెం, స్త్రీలకు 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించనున్నారు. ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. తొలిసారి పర్సనాలిటీ టెస్టు నిర్వహించనున్నారు. పరీక్షలో ఓసీలకు కనీసం 40 మార్కులు, బీసీలకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30 మార్కులు రావాలని సూచించారు. అలాగే దరఖాస్తు ఫీజుగా ఓసీలకు 400 రూపాయలు, ఎస్సీ, ఎస్టీలకు 200 రూపాయలుగా నిర్ణయించారు. వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.