: యువీ, సెహ్వాగ్, ఇషాంత్ శర్మలను వదిలించుకున్న ఫ్రాంచైజీలు
యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇషాంత్ శర్మలను ఐపీఎల్ ఫ్రాంఛైజీలు వదిలించుకున్నాయి. ఐపీఎల్ సీజన్-9కు ఆటగాళ్ల వేలం దగ్గరపడుతున్న దశలో పలు ఫ్రాంఛైజీలు భారంగా మారిన ఆటగాళ్లకు స్వస్తి పలికాయి. గత సీజన్ లో అత్యధిక మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన యువరాజ్ సింగ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అతనిని వదులుకుంటున్నట్టు ప్రకటించింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తాము ఆయనను వదులుకుంటున్నట్టు డీడీ ప్రకటించింది. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు వీరేంద్ర సెహ్వాగ్ ను డ్రాప్ చేస్తున్నట్టు పేర్కొంది. గత సీజన్ లో ఎన్నో అంచనాలతో కొనుగోలు చేసిన వీరిద్దరూ పేలవ ప్రదర్శనతో ఫ్రాంఛైజీలను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మను వదిలేసింది. ఇక వీరిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు.