: న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. హైదరాబాదులోని సంతోష్ నగర్ లో మెడికల్ షాపుల యజమానులతో చేతులు కలిపిన డ్రగ్ డీలర్లు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తూ న్యూఇయర్ జోష్ ను మరింత పెంచుతున్నారు. దీంతో మత్తులో తూలుతూ యువకులు న్యూ ఇయర్ వేడుకల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. సంతోష్ నగర్ లో వలపన్ని నలుగురు సభ్యులు కలిగిన డ్రగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు మెడికల్ షాపుల నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పది రూపాయల విలువ కలిగిన డ్రగ్ ఇంజెక్షన్లను కొనుగోలు చేసి, వాటిని కాలేజీ విద్యార్థులు, యువకులకు 400 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.