: తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
నూతన సంవత్సర వేడుకల వేళ పెట్రోలియం కంపెనీలు శుభవార్త వినిపించాయి. సౌదీ అరేబియాలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన నేపథ్యంలో ఈ సారి భారత్ లో కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్న వేళ ధరలు స్వల్పంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లీటరు పెట్రోల్ పై 63 పైసలు, లీటర్ డీజిల్ పై 1.04 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. తగ్గించిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. దీంతో నూతన సంవత్సరం వేళ పెట్రోల్ ధరలు తగ్గడాన్ని అంతా శుభసూచకంగా భావిస్తున్నారు.