: సిడ్నీని ముంచెత్తిన వెలుగు జిలుగులు


ఆస్ట్రేలియాలోని ప్రధాన పట్టణం సిడ్నీని వెలుగు జిలుగులు ముంచెత్తాయి. నూతన సంవత్సర వేడుకలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ ఏడాది కూడా భారీ ఎత్తున నిర్వహించింది. సిడ్నీ హార్బర్ సరిగ్గా పన్నెండు గంట కొట్టగానే బాణాసంచా కాల్పులు మొదలయ్యాయి. అంతకు ముందు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో నూతన సంవత్సర వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. ప్రత్యేక కార్యక్రమాలతో కొత్త సంవత్సరానికి ఆ రెండు దేశాల ప్రజలు ఆహ్వానం పలికారు. ఒక్కసారిగా ఎగసిన బాణాసంచా వెలుగులను సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు.

  • Loading...

More Telugu News