: అటువంటి వాళ్లు.. ‘జన్మభూమి’కి కలిసొస్తారని అనుకోవట్లేదు: సీఎం చంద్రబాబు
రాజధాని వస్తే పాలకపార్టీకి మంచి పేరు వస్తుందని భావించి నానాయాగీ చేసే వాళ్లు, జన్మభూమి కార్యక్రమానికి కలిసి వస్తారని తాను అనుకోవడం లేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి కార్యక్రమం జనవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒక టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. గతంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల గురించి కూడా బాబు ప్రస్తావించారు. 'రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విజయవాడలో ఇటీవల చోటుచేసుకున్న కాల్ మనీ వ్యవహారం గురించి ప్రతిపక్ష నేతలు లేనిపోని ఆరోపణలు చేశారని, విజయవాడ అంటేనే ఒక చులకన భావం వచ్చేలా ప్రతిపక్ష నేతలు ప్రవర్తించారని చంద్రబాబు విమర్శించారు.