: నా అత్యంత చెత్త ప్రదర్శన ఢిల్లీ టెస్టులో చేసిందే!: సౌతాఫ్రికా ఆటగాడు ఆమ్లా


తన కెరీర్ మొత్తంలో ఢిల్లీ టెస్టులో చేసిన ప్రదర్శనే అత్యంత చెత్త ప్రదర్శన అని సౌతాఫ్రికా జట్టు దిగ్గజ క్రికెటర్ హషీమ్ ఆమ్లా పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టు చేతిలో 241 పరుగుల ఘోర పరాజయం తరువాత పేలవ ప్రదర్శనపై సఫారీ జట్టు టెస్టు కెప్టెన్ ఆమ్లా మాట్లాడాడు. జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్ జట్లపై టెస్టు సిరీస్ లను గెలిచి ఉత్సాహంగా ఉన్న తమ జట్టు, బంగ్లాదేశ్ తో సిరీస్ ను డ్రా చేసుకోవాల్సి రావడం, భారత్ తో సిరీస్ పరాజయం డీలా పడేలా చేసిందని చెప్పాడు. భారత్ తో సిరీస్ చాలా క్లిష్టంగా జరిగిందని పేర్కొన్నాడు. అది ఆటగాడిగా, కెప్టెన్ గా తనకు గడ్డు కాలమని పేర్కొన్నాడు. ఢిల్లీ టెస్టులో తన ప్రదర్శన అత్యంత నిరుత్సాహానికి గురి చేసిందని వెల్లడించాడు. ఓ ఆటగాడు విఫలమైతే విశ్వాసం ప్రోది చేసుకునేందుకు ఎంతో సమయం పడుతుందని, అలాంటి సంధి కాలంలో తాను ఉన్నానని ఆమ్లా తెలిపాడు. ఆత్మవిశ్వాసం తిరిగి పొందడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేనని, అయితే ఒక్క మంచి ఇన్నింగ్స్ పడితే, అది ఆటను గాడిన పెడుతుందని ఆమ్లా పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News