: వన్డేలు, టెస్టుల్లో వరల్డ్ నెంబర్ టూ భారత్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో భారత జట్టు సత్తాచాటింది. టెస్టులు, వన్డేల్లో భారత జట్టు రెండవ స్థానం అలంకరించింది. టెస్టు ర్యాంకింగ్స్ లో సౌతాఫ్రికా అగ్రస్థానం కైవసం చేసుకోగా, వన్డేల్లో ఆస్ట్రేలియా జట్టు నెంబర్ వన్ గా నిలిచింది. ఇక వ్యక్తిగత ర్యాంకింగ్స్ లో టెస్టు బౌలర్, ఆల్ రౌండర్ గా అశ్విన్ నెంబర్ వన్ గా నిలిచి సత్తాచాటగా, వన్డే, టీట్వంటీల్లో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నెంబర్ టూ స్థానం అలంకరించాడు. వన్డే టాప్ 6 ర్యాంకును కెప్టెన్ ధోనీ సాధించగా, 7వ ర్యాంకులో బ్యాట్స్ మన్ గా శిఖర్ ధావన్ నిలిచాడు. వన్డే బౌలర్లలో అశ్విన్ 10వ ర్యాంకు సాధించాడు.