: ఏడాది చివరలో తగ్గిన బంగారం, వెండి ధరలు


ఈ ఏడాది బులియన్ మార్కెట్ చివరి ట్రేడింగ్ రోజున బంగారం, వెండి ధరలు తగ్గాయి. రూ.260 తగ్గడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.25,390కి చేరింది. అటు వెండి ధర కూడా రూ.250 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.33,300కి చేరింది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో, అమ్మకాల ఒత్తిడితో ఈ రెండింటి ధర తగ్గాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.76 శాతం తగ్గి 1,060.90 అమెరికన్ డాలర్లకు చేరింది.

  • Loading...

More Telugu News