: హమ్మయ్య... 200 మంది సెలవు పెట్టారు, ఇక హ్యాపీ: కేజ్రీవాల్
ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను సస్పెండ్ చేసిన తరువాత, 200 మంది అధికారులు మూకుమ్మడిగా సెలవు పెట్టి వెళ్లడంపై కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. వారి సెలవు తనకు సంతోషకరమని, ఇక ప్రభుత్వం మరింత నిజాయతీగా పనిచేస్తుందని అన్నారు. వారు ఎన్ని రోజులు సెలవు పెట్టినా, వేతనంతో కూడిన సెలవు తాను మంజూరు చేస్తానని, ప్రజలు సైతం ఆనందించే పని వారు చేశారని తన ట్విట్టర్ ఖాతాలో అభిప్రాయపడ్డారు. పనిలోపనిగా అధికారుల సెలవు వెనుక లెఫ్టినెంట్ గవర్నర్ నబీబ్ జంగ్ హస్తముందని ఆరోపించారు. ఆందోళనలో ఉన్న అధికారులతో ఆయన స్వయంగా ఫోన్లో మాట్లాడారని ఆరోపించారు. కాగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల వేతనాల పెంపు విషయమై, ఇద్దరు అధికారులు దస్త్రాలపై సంతకాలు పెట్టక పోగా వారిని విధుల నుంచి తొలగిస్తూ, కేజ్రీ సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.