: క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్ కోహ్లీ, మిథాలీరాజ్: బీసీసీఐ
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను బీసీసీఐ ప్రకటించింది. 2015 లో చూపిన ప్రదర్శన ఆధారంగా మెన్స్, విమెన్స్ క్రికెటర్స్ ను ఎంపిక చేసినట్టు బీసీసీఐ వెల్లడించింది. పురుషుల క్రికెట్ జట్టులో వన్డే, టెస్టుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ అవార్డును కైవసం చేసుకోగా, స్త్రీల క్రికెట్ జట్టు చరిత్రలో 5 వేల పరుగుల మైలురాయిని చేరుకుని, భారత తొలి మహిళా క్రికెటర్ గా నిలిచిన మిథాలీ రాజ్ ఈ ఏటి మేటి క్రికెటర్ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డులను జనవరి 5న ముంబై వేదికగా జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తామని బీసీసీఐ ప్రకటించింది. అలాగే కర్ణాటక క్రికెట్ బోర్డు ప్రకటించే స్టేట్ అసోసియేషన్ ఆఫ్ ద ఇయర్ గా టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఎంపికైనట్టు ఆ బోర్డు ప్రకటించింది. రంజీల్లో ప్రతిభకు ఊతప్పకు ఈ అవార్డు అందజేస్తున్నట్టు స్టేట్ బోర్డు తెలిపింది.