: అమరావతి పేరుతో సంక్రాంతికి 15 లగ్జరీ బస్సులు: ఎండీ సాంబశివరావు


ఈ ఏడాదిలో ఏపీ ఆర్టీసీలో నష్టాలను తగ్గించుకోగలిగామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. అలాగే రాబోయే రెండేళ్లలో నష్టాలను పూర్తిగా నివారిస్తామని చెప్పారు. ఆర్టీసీ మౌలిక వసతుల కార్పోరేషన్ ను ఏర్పాటు చేయనున్నామని విజయవాడలో మాట్లాడుతూ ప్రకటించారు. ఆర్టీసీకి ఉన్న స్థలాలను వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తామన్నారు. విజయవాడ బస్టాండ్ తరహాలో మిగతా జిల్లా కేంద్రాల బస్టాండ్లను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. దాని కోసం రూ.52 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఇక వచ్చే సంక్రాంతికి అమరావతి పేరుతో 15 లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయనున్నట్టు సాంబశివరావు వెల్లడించారు. 2010లో 70 అద్దె బస్సులు, రూ.100 కోట్లు వెచ్చించి 500 కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News