: కేసీఆర్ మరో వరం... త్వరలో డీఎస్సీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ!


కొత్త సంవత్సరం శుభవేళ, కేసీఆర్ సర్కారు తెలంగాణ వాసులపై వరాల మీద వరాల జల్లు కురిపిస్తోంది. కొద్ది సేపటి క్రితం కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరిస్తామని, కొత్త డీఎస్సీ ద్వారా 20 వేల మంది వరకూ టీచర్ ఉద్యోగాలను సంపాదించుకోవచ్చని తెలిపారు. మిగతా డిపార్టుమెంట్లలోని ఖాళీలను సైతం పూరించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. జూన్ 2 లోగా కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలన్నీ అందించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News