: 2016లో కాంగ్రెస్ లక్ష్యమిదే: మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ తీరును మరోసారి ఎండగట్టారు. పార్లమెంటును నాశనం చేయడమే వారి ముఖ్య ఆలోచనగా ఉన్నట్టు కనపడుతోందని విమర్శించారు. "గత 50-60 ఏళ్లుగా అధికారాన్ని అనుభవించిన వారు, ఇప్పుడు పార్లమెంటుకు అడ్డుపడుతున్నారు. సభ కార్యకలాపాలు సాగకుండా అడ్డుకుంటున్నారు. కొత్త సంవత్సరం 2016లో కూడా వారి లక్ష్యమిదే" అని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి మీరట్ కు 14 లైన్ల ఎక్స్ ప్రెస్ వేకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. "చట్టాలను చేయాల్సిన పార్లమెంటులో చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తూ అడ్డుకుంటున్నారు. ప్రజలు వారిని తిరస్కరించినా, బుద్ధి రాలేదు. మేము లోక్ సభలో మా అభిప్రాయం చెప్పలేకపోతున్నాం. కానీ ఇది జనసభ. ఇక్కడ మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు. మేం చేయాలన్న అభివృద్ధి పనులను చేసుకుంటూ ముందుకు సాగుతాం" అని అన్నారు.

  • Loading...

More Telugu News