: చండీయాగంతోనైనా కేసీఆర్ లో మార్పు రావాలి: డీకే అరుణ
తెలంగాణలో ప్రతిపక్షాలను లేకుండా చేయాలని టీఆర్ఎస్ చూస్తోందని కాంగ్రెస్ గద్వాల్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. అయితే ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షానికి మనుగడే ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఆయన నిర్వహించిన అయుత చండీయాగంతోనైనా మార్పురావాలని కోరారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన పార్టీ నేత దామోదర్ రెడ్డిని అరుణ, మండలి పక్షనేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఇవాళ అభినందించారు. ఈ గెలుపును తమ అధినేత్రి సోనియాగాంధీకి గిఫ్టుగా ఇచ్చామని అరుణ చెప్పారు.