: స్టార్టప్ వెంచర్లో యువరాజ్ సింగ్ పెట్టుబడులు


'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం' అన్న మాట సినిమా నటులకే కాకుండా క్రికెటర్లకు కూడా చక్కగా సరిపోతుందని చెప్పచ్చు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు పలు కంపెనీల్లో పెట్టుబుడులు పెడుతుండగా, తాజాగా క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా పెట్టుబడుల రంగంలోకి దిగాడు. ప్రముఖ వ్యాపారవేత్త, హౌసింగ్.కామ్ మాజీ సీఈవో రాహుల్ యాదవ్ ప్రారంభించనున్న స్టారప్ వెంచర్ 'ఇంటెలిజెంట్ ఇంటర్ ఫేసెస్'లో పెట్టుబడులు పెడుతున్నట్టు తన ఫేస్ బుక్ ఖాతాలో తెలిపాడు. ఇప్పటికే నిశాంత్ సింఘాల్ అనే వ్యాపారవేత్తతో కలిసి యువీ 'యూ వుయ్ క్యాన్ వెంచర్స్' ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దాని ద్వారా విద్య, బ్యూటీ, హెల్త్ కేర్, లాజిస్టిక్స్ లాంటి స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టారు.

  • Loading...

More Telugu News