: ఐఎస్ఐఎస్ కు సీన్ రివర్సయింది !


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు సీన్ రివర్సయింది. సోషల్ మీడియా ద్వారా యువతను తమ వైపు ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. ఐఎస్ నాయకుడు అబు బకర్ అల్-బగ్దాది గత వారం విడుదల చేసిన వీడియో టేపే ఇందుకు నిదర్శనం. ముస్లిం యువతను ఐఎస్ తరపున పోరాడాలని ఆ వీడియోలో పిలుపు నిచ్చారు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో వ్యతిరేకత వచ్చింది. ముస్లిం యువత ఐఎస్ లో చేరడం కన్నా వారు చేయాల్సిన మంచి పనులు చాలా ఉన్నాయంటూ నార్వేకు చెందిన ఇయూద్ ఎల్ బాగ్దాది అనే యాక్టివిస్ట్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఐఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని తన ట్విట్టర్ ఫాలోవర్లకు చెబుతున్నాడు. యాంటీ ఇస్లామిక్ స్టేట్ ప్రచారానికి సోషల్ మీడియాను ఆయన బాగా ఉపయోగిస్తున్నాడు.

  • Loading...

More Telugu News