: ఇకపై శత్రువులుగా బతకలేం: నవాజ్ షరీఫ్
ఇండియా, పాకిస్థాన్ దేశాలు ఇకపై శత్రువులుగా బతికే పరిస్థితులు లేవని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాక్ దినపత్రిక 'డాన్'తో ఆయన మాట్లాడుతూ, "అన్ని రకాల అంశాలు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ఇండియాను ఆహ్వానిస్తున్నా. ఇక ఇరుగు పొరుగు దేశాలు శత్రువులని భావిస్తే బతకలేం" అని ఆయన అన్నారు. చైనా, పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ శంకుస్థాపన సందర్భంగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత అధికారులతో నిత్యమూ మాటలు కలుపుతుండాలని పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ జాంజువాకు తాను సూచించానని తెలిపారు.