: కరీంనగర్ కోర్టులో అక్రమవడ్డీ వ్యాపారి మోహన్ రెడ్డి సోదరుడు, కుమారుడి వీరంగం
అక్రమవడ్డీ వ్యాపారాలకు పాల్పడిన కేసులో అరెస్టైన ఏఎస్సై మోహన్ రెడ్డి కుమారుడు అక్షయ్ రెడ్డి, ఆయన సోదరుడు కరీంనగర్ కోర్టులో వీరంగం సృష్టించారు. కోర్టులో హాజరుపరిచేందుకు ఇవాళ మోహన్ రెడ్డిని తీసుకొచ్చిన సమయంలో మీడియా ప్రతినిధులు ఫోటోలు తీశారు. దాంతో ఆగ్రహించిన ఏఎస్సై కుమారుడు, సోదరుడు కలసి మీడియా ప్రతినిధులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆలోగా వారిని అక్కడున్న న్యాయవాదులు అడ్డుకోవడంతో మోహన్ రెడ్డి సోదరుడు, కొడుకు గొడవకు దిగారు. మండిపడిన న్యాయవాదులు దాడి ఘటనను కోర్టు దృష్టికి తీసుకువెళతామని, కేసులు పెడతామని హెచ్చరించారు. వెంటనే వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, మోహన్ రెడ్డిని తిరిగి జైలుకు తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.