: ఏడోసారి ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత!
ఏఐడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు సీఎం జయలలిత ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఏకగ్రీవంగా అమ్మను ఎన్నుకున్నారు. ఏడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జయను పార్టీ కార్యకర్తలు గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా 14 తీర్మానాలను అన్నాడీఎంకే ఆమోదించింది. తమ సీఎం అభ్యర్థన మేరకు జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రాన్ని కోరింది. జాలర్ల సమస్యను పరిష్కరించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, శ్రీలంక ప్రభుత్వం మధ్య చర్చలు జరిగేలా చూడాలని అన్నాడీఎంకే విజ్ఞప్తి చేసింది. వరద బాధితులను ఆదుకునేందుకు తమిళనాడుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించింది. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయ కార్యక్రమాలు, పునరావాస చర్యలు వేగంగా అమలు చేసిన అమ్మకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు.