: అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకానికి హైకోర్టు అంగీకారం
అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అగ్రిగోల్డ్ డిపాజిట్ల స్కాం కేసుపై ఇవాళ విచారణ జరిగింది. ఫిబ్రవరి 1 నుంచి ఆస్తులు వేలం వేస్తామని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కోర్టుకు తెలిపింది. ఎంఎస్ పీసీ, శ్రీరామ్ ఆటో మాల్, ఈ-ప్రొక్యూర్ మెంట్ టెక్నాలజీ సంస్థలకు వేలం బాధ్యతలు అప్పగించినట్టు కమిటి వెల్లడించింది. తొలి విడతలో అగ్రిగోల్డ్ కు చెందిన ఆరు ఆస్తులను వేలం వేయనున్నట్టు కమిటీ సభ్యులు వివరించారు. ఒక్కో సంస్థకు రెండు ఆస్తులు వేలం వేసేందుకు అప్పగిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించి మూడు వారాల్లో వెబ్ సైట్ ఏర్పాటు చేసి, ఆస్తుల వేలం వివరాలను అందులో పొందుపరచాలని హైకోర్టు ఆదేశించింది. మొదటి విడత వేలంలో రూ.3,500 కోట్లు వస్తాయని కోర్టుకు కమిటీ తెలిపింది. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 8కి వాయిదావేసింది.