: ఈజిప్టులో ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ సేవలు నిలిపివేత
ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ అమలుచేసే విషయంలో భారత్ లో గతకొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుండగా ఇప్పటికే అవి అమలవుతున్న ఈజిప్టులో మాత్రం నిలిపివేశారు. ఈజిప్టులో ఫేస్ బుక్ భాగస్వామి టెలికామ్ సంస్థ 'ఎతిసలాద్ ఈజిప్టు'ను సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఫ్రీ బేసిక్స్ కావాలని 30 లక్షల మంది కోరితే ప్రస్తుతం 10 లక్షల మందికే ఈ సేవలు అందుతున్నాయి. అయితే రెండు నెలల కిందటే ప్రారంభమైన ఈ సేవలను ఇప్పుడు కొత్తగా నిషేధించడం గమనార్హం. ఈ సర్వీస్ ను ఎందుకు నిలివేస్తున్నారన్న విషయంపై అధికారులు ఇంకా వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే సేవలను మళ్లీ పునరుద్ధరిస్తామని ఫేస్ బుక్ అంటోంది.