: రంజిత్ కు వల వేసిన మహిళ... పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన ఫిదాయి!
భారత వైమానిక దళానికి చెందిన అధికారి కేకే రంజిత్ కు వల వేసి, భారత కీలక స్థావరాల సమాచారాన్ని ఇట్టే గుంజేసిన మహిళ ఉదంతంలో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. రంజిత్ కు సదరు మహిళ వేసిన వలకు సంబంధించిన నిన్న ఆసక్తికర కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఆ మహిళ ఎవరన్న విషయం నిన్న వెల్లడి కాలేదు. నేటి సంచికలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆ మహిళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందినదిగా ఓ కథనాన్ని రాసింది. అంతేకాక ఆ మహిళ ఫిదాయి అంటూ తన కథనంలో పేర్కొంది. తనను తాను బ్రిటన్ కు చెందిన దామిని మెక్ నాట్ గా పరిచయం చేసుకున్న ఆ మహిళ కొన్ని నెలల పాటు రంజిత్ తో చాటింగ్ చేసింది. అంతేకాక వారిద్దరి మధ్య శృంగారానికి సంబంధించి టెలిఫోనిక్ సంబాషణలు కూడా జరిగాయట. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రంజిత్ నుంచి మరిన్ని వివరాలు వెలికి రానున్నాయి.