: ఉగ్ర భయాలతో సంప్రదాయాలపై బెల్జియం నిషేధం!


నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సూచనగా బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో అధికారికంగా నిర్వహించే సంప్రదాయ బాణసంచా వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదుల దాడుల భయంతోనే బ్రెజిల్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకలపై దాడులు చేసేందుకు సిద్ధమైన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ముందు జాగ్రత్తగా ఫైర్ వర్క్స్ పై నిషేధం విధించామని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గురువారం సాయంత్రం ఏ విధమైన వేడుకలూ ఉండవని బ్రసెల్స్ మేయర్ యువాన్ మెయ్యూర్ వెల్లడించినట్టు అధికార వార్తా సంస్థ ఆర్టీబీఎఫ్ పేర్కొంది. కాగా, నవంబర్ 13 పారిస్ దాడుల తరువాత, విచారణ మొత్తం బెల్జియం కేంద్రంగానే సాగిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు బెల్జియంలోనే ఆశ్రయం పొందారని తేలడంతో, ఇక్కడే మరింతమంది ఉగ్రవాదులు దాగుండవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News