: కొత్త లీకులు... ఐఫోన్ 7 ఎలా ఉంటుందంటే...!
యాపిల్ స్మార్ట్ ఫోన్ల సిరీస్ లో 6 జనరేషన్స్ గడిచిపోయాయి. ఇక 7వ తరం ఫోన్ ఎలా ఉంటుంది? యాపిల్ 7 వర్షన్ తో పాటు, త్వరలో మార్కెట్లోకి రానున్న యాపిల్ 6సీ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ పై ఓ చైనా పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ ఫోన్లకు వాటర్ ప్రూఫ్ ప్రత్యేక ఆకర్షణని వెల్లడించింది. ఎ9 ప్రాసెసర్ ఉంటుందని, టచ్ ఐడీ, 2 జీబీ రామ్ ఉంటాయని, ఫోన్ బాడీపై యాంటీనా బ్యాండ్స్ ఉండవని పేర్కొంది. యాపిల్ కొత్త తరం ఫోన్లకు కావాల్సిన ముడి పదార్థాల్లో 30 నుంచి 35 శాతం వరకూ తైవాన్ కేంద్రంగా పనిచేస్తున్న కాచర్ టెక్నాలజీ అందిస్తోందని పేర్కొంది. ఐఫోన్ 7లో విప్లవాత్మక లైటింగ్ కనెక్టర్, యూఎస్బీ టైప్-సీ పోర్టు, మల్టీటచ్ 3డీ టచ్, డ్యూయల్ కెమెరా సెన్సార్లు, ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్ తదితరాలు కూడా ఉంటాయని సమాచారం.