: అంగారకుడిపైనా కొండచరియలు విరిగిపడుతున్నాయట!... రేర్ వీడియోను విడుదల చేసిన నాసా
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిన్న విడుదల చేసిన ఓ ఫొటో విశ్వవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే అంగారకుడిపై జీవం ఉందన్న కోణంలో సాగుతున్న పరిశోధనల్లో మరింత ముందడుగు పడిందని సదరు ఫొటో చెప్పకనే చెబుతోంది. అయినా సదరు ఫొటోలో ఏముందంటే... భారీ వర్షాలు కురుస్తున్న సందర్భాల్లో కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలు మనకు తెలిసిందే. ఏటవాలు కొండలపై నుంచి పడే బండరాళ్లు పెను విషాదాన్నే సృష్టిస్తున్నాయి. సరిగ్గా, అదే తరహాలో అంగారకుడిపై కూడా కొండ చరియలు విరిగిపడుతున్నట్లుగా, ఏటవాలు కొండపై నుంచి రాళ్లు కిందకు దొర్లుతున్నట్లుగా సదరు ఫొటోలోని దృశ్యం కనిపిస్తోంది. మార్స్ రికన్నైజెన్స్ ఆర్బిటర్ లో అమర్చిన రిజల్యూషన్ ఇమేజింగ్ సైన్స్ ఎక్స్ పెరిమెంట్ కెమెరా గతేడాది మార్చి 19న ఈ చిత్రాన్ని తీసిందట.