: కేజ్రీ కేబినెట్ తీర్మానంపై సంతకానికి నిరాకరణ... ఇద్దరు సివిల్ సర్వెంట్లను సస్పెండ్ చేసిన ఢిల్లీ సర్కారు


ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ల మధ్య మరో వివాదం రాజుకుంది. ప్రభుత్వ న్యాయవాదుల వేతనాలను పెంచుతూ కేజ్రీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సంతకం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు యశ్ పాల్ గార్గ్, సుభాష్ చంద్ర నిరాకరించారు. దీంతో వారిద్దరిని సస్పెండ్ చేస్తూ కేజ్రీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. కేజ్రీ సర్కారు నిర్ణయంపై ఆ రాష్ట్ర సివిల్ సర్వెంట్లు భగ్గుమన్నారు. గార్గ్, సుభాష్ లపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే, తామంతా సామూహిక సెలవులో వెళతామంటూ దాదాపు 200 మంది సివిల్ సర్వెంట్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు ఈ విషయం ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరో వివాదానికి తెర లేపేలానే ఉంది. వాస్తవానికి సివిల్ సర్వెంట్లను సస్పెండ్ చేసే అధికారం ఢిల్లీ సర్కారుకు లేదు. ఏదేని సందర్భంలో అలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలంటే, కేంద్ర హోంశాఖకు ప్రతిపాదించాల్సి ఉంది. హోం శాఖకు మాత్రమే ఢిల్లీ సివిల్ సర్వెంట్లను సస్పెండ్ చేసే అధికారం ఉంది. ఈ నేపథ్యంలో కేజ్రీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News