: ‘ఉగ్ర’దాడులకు కుట్ర పన్నిన దంపతులకు యావజ్జీవం!


లండన్ లో ఉగ్రవాద దాడికి కుట్ర పన్నిన దంపతులకు జీవిత ఖైదు విధించారు. లండన్ రవాణా వ్యవస్థపై దాడి జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా మరో దాడికి పాల్పడేందుకు మహ్మద్ రెహ్మాన్(25), అతని భార్య సనా అహ్మద్ ఖాన్(24)లు కుట్ర పన్నారు. వీళ్లిద్దరికి యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. రెహ్మాన్ కు 27 సంవత్సరాలు, సనాకు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. లండన్ లోని సబ్ వే లేదా షాపింగ్ మాల్ పై దాడికి వారు కుట్రపన్నినట్లు పోలీసులు చెప్పారు. బాంబులు పేల్చేందుకు అవసరమైన సమాచారాన్ని వారు ట్విట్టర్ ద్వారా పొందినట్లు ఆధారాలు లభించాయని అన్నారు. 2005 జులై 7వ తేదీన సబ్ వే ట్రెయిన్లు, బస్సుపై సూసైడ్ బాంబర్లు దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటనలో సుమారు 52 మంది చనిపోయారు.

  • Loading...

More Telugu News