: కరిష్మా దగ్గరున్న పిల్లల్ని నాకు అప్పగించండి: సంజయ్ కపూర్


బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ దగ్గరున్న తమ పిల్లలను తనకు అప్పగించాలని ఆమె భర్త సంజయ్ కపూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విడాకుల కోసం గతంలో వీరు పెట్టుకున్న పిటిషన్ ను న్యాయస్థానం గత నెలలో పరిష్కరించింది. అయితే పిల్లల కస్టడీని తనకు అప్పగించాలని కోరుతూ సంజయ్ కపూర్ 15 రోజుల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇది విచారణకు వచ్చిందని అతని తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై కరిష్మా కపూర్ న్యాయవాది స్పందించలేదు. కాగా, సంజయ్, కరిష్మా మధ్య విభేదాలు రావడంతో కరిష్మా పిల్లలతో వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News