: ఎలుక ఒక విమానాన్ని వెనక్కి రప్పిస్తే...కుక్క మరో విమానాన్ని ఆపేసింది


భారత్ లో రెండు విమానాల్లోని ప్రయాణికులను ఎలుక, కుక్క చికాకు పెట్టించాయి. వివరాల్లోకి వెళ్తే... ముంబై నుంచి లండన్ వెళ్తున్న విమానంలో ఒక ఎలుక దాక్కున్నట్టు విమాన సిబ్బంది గుర్తించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబైలో ల్యాండ్ చేశారు. అలాగే పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం రన్ వే పైకి వచ్చిన సమయంలో ఓ కుక్క దూసుకువచ్చింది. దీంతో విమానాన్ని ఆపేసిన సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు రంగప్రవేశం చేసి దానిని రన్ వే పై నుంచి తరిమిన అనంతరం విమానం టేకాఫ్ తీసుకుంది. దీంతో ముంబైలో ఎలుకను, అమృత్ సర్ లో కుక్కను విమాన ప్రయాణికులు తిట్టుకున్నారు.

  • Loading...

More Telugu News