: అమెరికాలో వర్శిటీలు బ్లాక్ లిస్టులో ఉన్నాయన్నమాట అవాస్తవం: విదేశీ వ్యవహారాల శాఖ
అమెరికా విద్యపై భారత విదేశీ వ్యవహారాల శాఖ తాజా ప్రకటన చేసింది. ఎడ్యుకేషన్ వీసాపై వెళ్లే ఇతర విద్యార్థులను కూడా అమెరికా వెనక్కి పంపిందని పేర్కొంది. అంతేకాకుండా, బిజినెస్, వర్క్, టూరిజం వీసాపై వెళ్లే వారిని కూడా యూఎస్ తిరస్కరిస్తోందని తెలిపింది. అక్కడి యూనివర్శిటీలు కొన్ని బ్లాక్ లిస్టులో ఉన్నాయన్నమాట అవాస్తవమని, ఇమ్మిగ్రేషన్ అధికారుల అసెస్ మెంట్ ఆధారంగానే యూఎస్ వెళ్లే వారు తిరస్కరణకు గురవుతున్నారని పేర్కొంది. విద్యార్థులు పొందిన వీసాకు, వారిచ్చిన సమాచారానికి పొంతన లేకుండా ఉంటోందని అమెరికా తెలిపిందని, ఈ నేపథ్యంలో విద్యార్థులు తగిన పత్రాలు తమ వెంట తీసుకెళ్లాలని విదేశీ వ్యవహారాల శాఖ ఆ ప్రకటనలో కోరింది.