: ఆకల్లేకపోయినా సరదాగా తింటున్నారా... అయితే, జాగ్రత్త!


సాధారణంగా స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడు ఆకల్లేకపోయినా టైంపాస్ అంటూ తింటూ ఉంటాం. అలా తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఆకలిగా ఉన్నప్పుడు తినే తిండి అనారోగ్యం కలిగిస్తుందని అమెరికాలోని ఇల్లినాయిస్ లోని డేవిడ్ గాల్ ఆఫ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధనల వివరాలను అసోసియేషన్ ఆప్ కన్స్యూమర్ రీసెర్చ్ అనే జర్నల్ లో ప్రచురించింది. ఆహారం తీసుకున్నప్పుడు గ్లూకోజ్ స్థాయులను పరిశీలిస్తూ వీరు పలు పరిశోధనలు నిర్వహించినట్టు జర్నల్ పేర్కొంది. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం సంక్రమిస్తుందని, ఆకలి లేనప్పుడు సరదాగా తినే తిండి అనారోగ్యంపాలు చేస్తుందని వీరి పరిశోధనల ద్వారా వెల్లడైందని జర్నల్ తెలిపింది.

  • Loading...

More Telugu News